Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఉభయసభలూ మరుసటి రోజుకు వాయిదా పడనున్నాయి. ఆ వెంటనే శాసనసభ, శాసనమండలి వ్యవహారాల సలహా మండళ్లు భేటీ అయి సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నాయి. ప్రభుత్వం తరఫున 25 నుంచి 30 అంశాలను వైకాపా చర్చకు ప్రతిపాదించనుంది. ఈ నెల 17న సభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మరుసటిరోజు 18న ప్రవేశపెట్టే ప్రతిపాదన కూడా తాజాగా చర్చల్లోకొచ్చింది. దీనిపై నేడు స్పష్టత రానుంది. ఈ సమావేశాల్లో సీఎం జగన్ పలు అంశాలపై కీలక ప్రకటనలు చేయనున్నారు. తాను విశాఖకు తరలి వెళ్లనుండటంపైనా స్పష్టత ఇవ్వనున్నారు.