Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తుపాకీ అంటే ఏంటో తెలియని ఓ మూడేళ్ల పాప దాన్ని ఆట వస్తువుగా భావించి పేల్చింది. ప్రమాదవశాత్తూ జరిగిన ఈ ఘటనలో ఆ చిన్నారి అక్క ప్రాణాలు కోల్పోయింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హ్యూస్టన్ ప్రాంతంలోని టామ్బాల్ పార్క్వే సమీపంలోని అపార్ట్మెంటులో ఓ కుటుంబం నివసిస్తోంది. ఇందులో ఇద్దరు చిన్నారులున్నారు. ఆదివారం సాయంత్రం వీరిద్దరూ బెడ్రూమ్లో ఆడుకుంటున్నారు. కుటుంబంలోని పెద్దలు ఇంట్లో ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా బెడ్రూమ్ నుంచి తుపాకీ పేలిన శబ్దం వినిపించడంతో పరుగున అక్కడకు వెళ్లగా.. నాలుగేళ్ల చిన్నారి రక్తపుమడుగులో కన్పించింది.చిన్నారులిద్దరూ ఆడుకుంటూ ఉండగా.. మూడేళ్ల పాపకు గదిలో ఫుల్గా లోడ్ చేసిన గన్ దొరికింది. అది ఎంత ప్రమాదకరమో తెలియని ఆ పసికందు నాలుగేళ్ల తన సోదరిని కాల్చింది.