Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆఫ్రికన్ కంట్రీ మలావి ఫ్రెడ్డీ తుపానుతో అతలాకుతలం అవుతోంది. నెల రోజుల వ్యవధిలోనే తుపాను బీభత్సం సృష్టించింది. దీని కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉద్ధృతికి జనం కొట్టుకుపోతున్నారు. భవనాలు కుప్పకూలుతున్నాయి. ఇప్పటి వరకు 100 మందికిపైగా మృత్యువాత పడ్డారు. వారిలో 60 మంది మృతదేహాలను గుర్తించారు. ఫ్రెడ్డీ తుపాను దెబ్బకు దక్షిణ, మధ్య ఆఫ్రికా వణికిపోయింది. పలు ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఇక్కడ చాలా వరకు మట్టితో నిర్మించిన నివాసాలే ఉండడంతో అవి కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. తక్షణమే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. చెట్లు కూలి, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.