Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కరీంనగర్
కరీంనగరంలో జిల్లా తిమ్మాపూర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. హిజ్రాలపై ఫంక్షన్ హాల్ సిబ్బంది దాడి చేసి చితకబాదారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్గునూర్ ఉన్నతి ఫంక్షన్ హాల్ లో పోరండ్ల గ్రామానికి చెందిన వారి వివాహ వేడుక జరుగుతోంది. విషయం తెలుసుకున్న కరీంనగర్‌కు చెందిన హిజ్రాలు ఫంక్షన్ హాల్‌కు వెళ్లారు. పెళ్లికొడుకు నుంచి కొంత డబ్బును కానుకగా ఇవ్వాలని కోరారు.
ఈ తరుణంలో పెళ్లి కొడుకు బంధువులు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించారు. అయినా హిజ్రాలు చాలా దూరం నుంచి వచ్చామని కాస్తైన డబ్బులు ఇవ్వాలని వేడుకున్నారు. దీంతో అక్కడున్న ఫంక్షన్ హాల్ మేనేజర్, మరికొందరు సిబ్బంది హిజ్రాలపై దాడికి దిగారు. మాట మాట పెరిగి అదికాస్త ఇనుప రాడ్లు, గొడ్డళ్లతో దాడి చేసేంతగా వెళ్లింది. విచక్షణారహితంగా హిజ్రాలపై దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. అక్కడ జరుగుతున్న ఘటనను ఎల్ఎండీ పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన హిజ్రాలను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో సోమవారం హిజ్రాల ఫిర్యాదు మేరకు ఫంక్షన్ హాల్ మేనేజర్, సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు ఎల్ఎండీ ఎస్సై ప్రమోద్‌రెడ్డి తెలిపారు.