Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వేములవాడ
మార్చి 15 నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు విద్యార్థులకు ఇంటర్ బోర్డు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. మార్చి 15 నుంచి మొదలు కానున్న ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను ఇంటర్మిడియెట్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ హాల్ టికెట్లను వెబ్ సైట్ లో పొందుపరిచారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నేరుగా వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు పొందవచ్చని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు తెలిపారు. హాల్టికెట్లలో తప్పులు ఉంటే విద్యార్థులు సరిచేసుకోవాలని సూచించారు. హాల్‌టికెట్‌పై కాలేజీ ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తున్నామని ప్రకటించారు.
https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.
ఈ తరుణంలో డౌన్ లోడు చేసుకున్న హాల్ టికెట్లలో వివరాలను విద్యార్థులు క్షుణ్ణంగా పరిశీలించాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు. విద్యార్థి పేరు, ఫోటో, సంతకం, మీడియం, పరీక్షకు హాజరయ్యే సబ్జెక్టులు తదితర అంశాలను చెక్ చేసుకోవాలని, వీటిల్లో ఏమైనా తేడాలు ఉంటే కళాశాల ప్రిన్సిపల్ లేదా జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి దృష్టికి తీసుకెళ్లి వివరాలను సరి చేసుకోవాలని సూచించారు.