Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విశాఖపట్నం
ఈ నెల 19న విశాఖపట్నంలో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఆన్లైన్లో ఈ నెల 10 నుంచే అందుబాటులో ఉంచగా ఆఫ్‌లైన్‌లో నేటి నుంచి విక్రయిస్తున్నారు.
ఈ తరుణంలో విశాఖ నగరంలోని పీఎంపాలెం క్రికెట్ స్టేడియం-బి మైదానం, జీవీఎంసీ మున్సిపల్ స్టేడియం, రాజీవ్‌గాంధీ క్రీడా ప్రాంగణం వద్ద టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. టికెట్ కౌంటర్ల వద్ద వేకువజాము నుంచే క్రికెట్ అభిమానులు బారులు తీరారు. భారీగా తరలివచ్చిన అభిమానులతో విక్రయ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.