Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మరోసారి సీబీఐ ముందు హాజరయ్యారు. ఇప్పటికే మూడుసార్లు ఆయన్ను విచారించిన సీబీఐ అధికారులు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో హైదరాబాద్ వచ్చారు. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ నేతృత్వంలో అధికారులు అవినాష్‌ను విచారిస్తున్నారు.
అయితే పార్లమెంటు సమావేశాలు ఉన్నందున సీబీఐ ముందు హాజరుకు మినహాయింపు ఇవ్వాలంటూ సోమవారం సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ రాశారు. దీనిపై సీబీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. తెలంగాణ హైకోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ ఎదుట హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఎంపీ కోరారు. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సీబీఐ వద్దే తేల్చుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఈ తరుణంలో సీబీఐకి ఎంపీ లేఖ రాసినా స్పందన లేకపోవడంతోనే విచారణకు ఆయన హాజరైనట్లు తెలుస్తోంది.