Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ల ఏఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రవీణ్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అతడు గ్రూప్-1 పరీక్ష రాసినట్లు వెల్లడైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ తరుణంలో ప్రిలిమ్స్ పేపర్‌ను అతడు లీక్‌చేశాడా? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. ప్రవీణ్ రాసిన పేపర్‌తో పాటు అతడికి వచ్చిన కోడ్ ప్రశ్నపత్రాన్ని పోలీసులు, టీఎస్పీఎస్సీ అధికారులు పరిశీలిస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలు వచ్చిన సర్వర్‌ను సైబర్ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. పేపర్ లీక్ అయిందా? లేదా? అనే కోణంలో సైబర్ నిపుణులు తనిఖీ చేస్తున్నారు. మరోవైపు ప్రశ్నపత్రం లీకేజీతో సంబంధం ఉన్నవారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేవైఎం కార్యకర్తలు టీఎస్పీఎస్సీ కార్యాలయ్యాన్ని ముట్టడించారు. గేట్ల పైకి ఎక్కి కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ను సస్పెండ్ చేయాలంటూ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.