Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్లోని విదిషా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మార్చి 14న ఉదయం ఇంటి దగ్గర ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. జిల్లాలోని లాటరి తహసీల్ పరిధిలోని ఖేర్ఖేడీ పత్తర్ గ్రామంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో లోకేష్ అహిర్వార్ అనే బాలుడు ఆడుకుంటూ బోరుబావిలోకి జారిపడ్డాడని అధికారి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. జేసీబీతో చిన్నారిని సురక్షితంగా రక్షించేందుకు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. బాలుడి పరిస్థితిని ఎలా ఉందో తెలుసుకోవడనికి కెమెరాను బోర్ వెల్ లోకి పంపించామని ఆయన తెలిపారు.
మరో వైపు మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలో మార్చి 13వ తేదీ సోమవారం మధ్యాహ్నం.. పొలంలో బాలుడు ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు రెస్క్యూ టీంను రప్పించారు. 15 నుంచి 20 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్లు గుర్తించిన సహాయ బృందాలు.. రక్షించేందుకు బోరుకు సమాంతరంగా గొయ్యిని తవ్వారు. అయినా బాలుడిని ప్రాణాలతో రక్షించలేకపోయారు.