Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో నియామక బోర్డుల అధికారులతో శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. టీఎస్పీఎస్సీ భర్తీ చేస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం లీకైందని తేలడంతో.. ఉద్యోగ నియామకాలపై సీఎస్ సమీక్ష నిర్వహిస్తున్నారు.
ఈ సమీక్షా సమావేశానికి టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, పోలీసు నియామక బోర్డు చైర్మన్ శ్రీనివాస్ రావు, గురుకుల నియామక బోర్డు కార్యదర్శి మల్లయ్య భట్టు, వైద్య నియామక బోర్డు జేడీ గోపీకాంత్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, జీఏడీ ముఖ్య కార్యదర్శితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.