Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: భారత్‌లో పోకో ఎక్స్5 5జీ పేరుతో పోకో న్యూ ఎక్స్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది. న్యూ పోకో ఎక్స్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 120హెచ్జడ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే, 48 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో 33 డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో భారీ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకు రానుంది.
5జీ సపోర్ట్‌తో కస్టమర్లను ఆకట్టుకోనున్న పోకో ఎక్స్5 5జీ 128జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్లు వరుసగా రూ. 18999, రూ. 20,999కి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సూపర్నోవా గ్రీన్, వైల్డ్‌క్యాట్ బ్లూ, జాగ్వర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. మార్చి 21 నుంచి పోకో ఎక్స్ 5జీ సేల్ భారత్‌లో షురూ కానుంది. లాంఛ్ ఆఫర్ కింద ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేసేవారికి పోకో, ఫ్లిప్‌కార్ట్ రూ. 2000 డిస్కౌంట్ అందిస్తున్నారు. దీనికి అదనంగా కంపెనీ రూ. 2000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. రూ. 20,000లోపు స్మార్ట్‌ఫోన్ కోసం చూసే వారికి పోకో ఎక్స్5 5జీ మేలైన ఎంపికని టెక్ నిపుణులు చెబుతున్నారు. పోకో ఎక్స్5 5జీ 6.67 ఇంచ్ ఎఫ్‌హెచ్‌డీ+ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో ఆకట్టుకుంటుంది. రూ. 20,000లోపు 5జీ స్మార్ట్ఫోన్లు ఆఫర్ చేస్తున్న బ్రాండ్లకు పోకో ఎక్స్5 5జీ దీటైన పోటీ ఇవ్వనుంది.