Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్నప్పటికీ.. ఎంతోసేపు నిలబడలేకపోయాయి. ఐటీ, లోహ, బ్యాంకింగ్ షేర్లలో వచ్చిన అమ్మకాలు సూచీలను కిందకు లాగాయి. మరోవైపు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం ప్రభావమూ కొనసాగింది. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి నిఫ్టీ 50, సెన్సెక్స్ సూచీలు మూడు శాతానికి పైగా నష్టపోయాయి.