Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఎయిర్ ఇండియా విమానంలో సిగరేట్ తాగి.. అనుచితంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని కోర్టు జైలుకు పంపింది. ఈ కేసులో కోర్టు సదరు వ్యక్తికి రూ.25వేలు జరిమానా విధించింది. అయితే, సదరు వ్యక్తి రూ.250 మాత్రమే చెల్లిస్తానని భీష్మించడంతో నిందితుడు రత్నాకర్ ద్వివేదిని జైలుకు పంపింది. సదరు వ్యక్తి ఇటీవల ఎయిర్ ఇండియాకు చెందిన లండన్ – ముంబయి విమానంలోని టాయిలెట్లో సిగరేట్ తాగాడు. ఈ క్రమంలో ఫైర్ అలారమ్ మోగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వాష్‌రూమ్ వద్దకు వెళ్లి చూడగా సదరు వ్యక్తిలో సిగరేట్ కనిపించింది.
దాంతో వెంటనే దాన్ని ఆర్పివేశారు. ఆ తర్వాత రత్నాకర్‌ను సీటు వద్దకు తీసుకెళ్లి కూర్చుండబెట్టగా.. సిబ్బందిపైకి అరవడంతో పాటు వాగ్వాదానికి దిగాడు. దీంతో తోటి ప్రయాణికులు సైతం ఇబ్బందులకు గురయ్యారు. ఆ తర్వాత విమాన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా.. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 336, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ 1937లోని సెక్షన్ 22, 23, 25 కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కోర్టులో హాజరుపరుచగా.. కోర్టు రూ.25వేల జరిమానా విధిచింది. అయితే, సెక్షన్ 336 కింద ఆన్లైన్లో కేవలం జరిమానా రూ.250 మాత్రమే చూపించిందని, తాను అంతే చెల్లిస్తానని నిందితుడు భీష్మించడంతో కోర్టు జైలు శిక్ష విధించింది.