Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో మంత్రులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. మంత్రుల పని తీరును గమనిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. తేడా వస్తే మంత్రులను మారుస్తానంటూ జగన్ హెచ్చరించారు. జులైలో విశాఖ వెళ్తామంటూ జగన్ మంత్రులకు చెప్పారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని మంత్రులకు జగన్ స్పష్టం చేశారు. క్యాబినెట్ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించినట్లు తెలుస్తోంది. జూలై నెల నుంచి ప్రభుత్వ పాలన విశాఖపట్నం నుంచి జరుగుతోందని ఆయన చెప్పారు. విశాఖపట్నం వెళ్లేందుకు దాదాపు ముహూర్తం కూడా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం జగన్ అడ్డదారులు ఎంచుకున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు, బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. కల్తీమద్యం తయారీ, విక్రయదారులు, ఎర్రచందనం స్మగ్లర్లను వైసీపీ తరఫున పెద్దల సభకు పంపాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ తప్పుడు విధానాలపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అక్రమ వ్యవహారాలపై ఈసీ చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయన్నారు.