Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులు అరెస్టు చేసిన 9మంది నిందితులకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి 9మంది నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను చంచల్గూడ జైలుకు తరలించనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెల్లడించారు. ‘‘ఏఈ, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష పత్రాలను ప్రవీణ్ తన వద్దే ఉంచుకున్నాడు. 24 పేజీల ఏఈ పరీక్ష పేపర్ నకళ్లు, 25 పేజీల టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష పత్రాల నకళ్లు ప్రవీణ్ నుంచి స్వాధీనం చేసుకున్నాం’’ అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ బేగంబజార్ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.