Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పాకిస్థాన్
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పోలీసుులు అరెస్ట్ చేశారు. తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపు 80 కేసులు ఉన్నాయి. జమాన్ పార్క్‌లోని ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) కార్యకర్తలు గుమిగూడారు. ఇమ్రాన్ ను అరెస్ట్ చేయోద్దంటూ నిరసనలు తెలిపారు. తోష్ఖానా అంటే ఖజానా అని అర్థం. ఇది పాకిస్థాన్ ప్రభుత్వ శాఖ కేబినెట్ డివిజన్ పర్యవేక్షణలో ఇది పని చేస్తోంది. రాజకీయ నేతలకు, అధికారులకు వచ్చే బహుమతులను ఇందులో ఉంచుతారు. అయితే బహుమతుల విలువ రూ. .30,000 కన్నా తక్కువగా ఉంటే, పాకిస్థాన్ అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి దానిని తన వద్ద ఉంచుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఖరీదు అయితే చట్టం ప్రకారం తోష్‌ఖానాలో ఉంచాలి. ఇమ్రాన్ ఖాన్ పీఎంగా ఉన్న టైమ్ లో ఖరీదైన బహుమతులను తోష్‌ఖానాకు అప్పగించలేదని, తన వద్ద ఉంచుకున్నారని ఆరోపణలు నమోదయ్యాయి.