Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్‌కు బదిలీ చేసింది. ఈ కేసును సిట్‌కు బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగనుంది. ఇప్పటి వరకు ఈ కేసును బేగంబజార్ పోలీసులు దర్యాప్తు చేశారు. అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి నిందితులపై 409, 420, 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో 9 మంది నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఏ3 రేణుకను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. మిగతా 8 మందిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.