Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
విశాఖలో నిర్వహించిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ విజయవంతం చేసిన వారిని కేబినెట్ అభినందించిందని సమాచారశాఖ మంత్రి సీహెచ్ వేణుగోపాల కృష్ణ తెలిపారు. సీఎం జగన్ అధ్యక్షతన మంగళవారం కేబినెట్ భేటీ జరిగింది. అనంతరం మంత్రి వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో పింఛన్లు 3వ తేదీన పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. ఏప్రిల్ 1న రిజర్వు బ్యాంకు సెలవు, 2న ఆదివారం కావడంతో 3న పింఛన్లు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. షెడ్యూల్ కులాల చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ లభించిందన్నారు. బీసీ కమిషన్, ఎస్టీ, మైనార్టీ, మహిళా కమిషన్ ఛైర్మన్ల పదవీ కాలాన్ని రెండేళ్లకు కుదిస్తూ చేసిన చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
ఈ క్రమంలోనే ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనల సవరణకు కేబినెట్ ఆమోదం లభించిందన్నారు. ఏపీ పబ్లిక్ లైబ్రరీ చట్ట సవరణ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ఏపీ ఎడ్యుకేషన్ ఆర్డినెన్స్ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించిందన్నారు. ఏపీ రిజిస్ట్రేషన్ చట్టం-1908 సవరణకు, ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు మంత్రి వివరించారు. దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులను పాలకమండలిలో సభ్యులు గా నియమించే ప్రతిపాదనకు ఆమోదించినట్టు మంత్రి తెలిపారు.