Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ టెస్టుల్లో ఓ మంచి రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రాను అధిగమించి సుదీర్ఘ ఫార్మాట్లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ (90)ని పెవిలియన్‌కు పంపి అక్షర్ ఈ ఘనతను అందుకున్నాడు. బుమ్రా 2,465 బంతుల్లో 50 వికెట్లు పడగొట్టగా.. అక్షర్ 2,205 బంతుల్లోనే ఈ మార్క్‌ను చేరుకున్నాడు. అక్షర్ పటేల్ ఈ సిరీస్‌లో బంతి పెద్దగా ప్రభావం చూపకపోయినా బ్యాట్‌తో మాత్రం అదరగొట్టాడు. సిరీస్‌లో అత్యధిక పరుగుల చేసిన వారి జాబితాలో ఉస్మాన్ ఖావాజా (333), విరాట్ కోహ్లీ (297) తర్వాత 264 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇందులో రెండు వికెట్లు నాలుగో టెస్టులో తీసినవే.
టెస్టుల్లో వేగంగా 50 వికెట్లు పడగొట్టిన బౌలర్లు (భారత్)
- అక్షర్ పటేల్ - (2,205 బంతుల్లో)
- జస్ప్రీత్ బుమ్రా - (2,465 బంతుల్లో)
- కర్సన్ ఘవ్రి - (2,534 బంతుల్లో)
-రవిచంద్రన్ అశ్విన్ - (2,597 బంతుల్లో)