Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఉమేష్ పాల్ హత్య కేసులో ఎన్కౌంటర్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో నిందితుడు విజయ్ చౌదరి అలియాస్ ఉస్మాన్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. కౌంధియారా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోతి, బెల్వా మధ్య ఉదయం 5.30 గంటలకు ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు ధూమంగంజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేష్ కుమార్ మౌర్య తెలిపారు. అయితే, తన భర్తను సోమవారం తెల్లవారుజామున తీసుకెళ్లి బూటకపు ఎన్కౌంటర్లో పోలీసులు హతమార్చారని ఉస్మాన్ భార్య సుహాని ఆరోపించారు. కాగా, ఈ ఎన్కౌంటర్లో కానిస్టేబుల్ నరేంద్ర పాల్ చేతికి కూడా గాయాలయ్యాయి. 2005లో రాజు పాల్ హత్య జరుగగా, ఆ హత్య కేసులో ఉమేష్ పాల్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. ఫిబ్రవరి 24న ధూమన్గంజ్లో ఉమేష్‌ను ఆయన నివాసం వెలుపల దుండగులు కాల్పులు జరగడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అతని ఇద్దరి గన్మెన్లు చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ కేసును యూపీ సర్కార్ ఒక సవాలుగా తీసుకుంది.