Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ : ముంబై ఇండియన్స్ మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (24), అమేలియా (14) ధాటిగా ఆడుతున్నారు. నాలుగో వికెట్‌కు 23 బంతుల్లో 40 రన్స్ చేశారు. దాంతో, ముంబై 16 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 124 రన్స్ చేసింది. తొలి వికెట్ పడ్డాక.. యస్తికా భాటియా (44), నాట్ సీవర్ బ్రంట్ (36) ముంబైని ఆదుకున్నారు. వీళ్లు రెండో వికెట్‌కు 74 రన్స్ జోడించారు. హాఫ్ సెంచరీకి దగ్గర్లో యస్తిక రనౌట్ అయ్యి మూడో వికెట్‌గా వెనుదిరిగింది. అప్పటికి ముంబై స్కోర్.. 84. ఓపెనర్ హేలీ మాథ్యూస్ (0) ఖాతా తెరవకుండానే మొదటి ఓవర్లో ఔటయ్యింది. అష్ గార్డ్నర్ వేసిన నాలుగో బంతికి డంక్లెన్ క్యాచ్ పట్డడంతో హేలీ వెనుదిరిగింది. గుజరాత్ బౌలర్లలో అష్ గార్డ్నర్, కిమ్ గార్త్ తలా ఒక వికెట్ తీశారు.