Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ జానర్దన్రెడ్డి తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దురదృష్టకరమైన వాతావరణంలో మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను అరికట్టేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో 30లక్షల మంది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఈ విధానాన్ని యూపీఎస్సీ కూడా ప్రశంసించిందన్నారు. యూపీఎస్సీకి 2వేల మంది ఉద్యోగులు ఉంటారని తెలిపారు. ఏపీపీఎస్సీ ఉన్నప్పుడు సగటున ఏటా 4వేల ఉద్యోగాలు భర్తీ చేసేవారని చెప్పారు. తెలంగాణ వచ్చాక దాదాపు 35వేల ఉద్యోగాల భర్తీ అవుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రస్తుతం 25వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.