Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి: డబ్ల్యూపీఎల్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ (51; 30 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), యాస్తిక భాటియా (44; 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), నాట్ సీవర్ (36; 31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అమేలియా కెర్ (19) పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో ఆష్లీన్ గార్డ్నర్ 3, కిమ్ గార్త్, స్నేహ్ రాణా, తనుజ కన్వర్ తలో వికెట్ పడగొట్టారు.