Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి: విజయవాడ ఎన్ఐఏ కోర్టులో మంగళవారం కోడికత్తి కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు అథారిటీ కమాండర్ దినేష్‌ను న్యాయస్థానం విచారించింది. కేసుకు సంబంధించిన కోడికత్తి, మరో చిన్న కత్తి, పర్సు, సెల్‌ఫోన్‌ను పోలీసులు కోర్టుకు అప్పగించారు. అనంతరం విచారణను ధర్మాసనం వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ఏప్రిల్ 10న విచారణకు హాజరుకావాలని ముఖ్యమంత్రి జగన్‌ను ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. సీఎంతో పాటు ఆయన పీఏ కె.నాగేశ్వర్‌రెడ్డి కూడా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.