Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్ కే విజయరామారావు భౌతికకాయానికి మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. విజయరామారావు సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సీబీఐ మాజీ డైరెక్టర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించిన ఆయన.. ఏర్పాట్లపై అధికారులను ఆరా తీశారు. సమావేశంలో ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు శ్రావణ్ కుమార్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉన్నారు.