Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యాసంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) మెడికల్ సీట్ల భర్తీకి నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా, డీఎన్బీ కోర్సుల్లో ప్రవేశాలకు మార్చి 5న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ ఫలితాల్లో అర్హత సాధించిన విద్యార్థులందరికీ ఆయన కంగ్రాట్స్ చెప్పారు. నీట్ పీజీ పరీక్షలను మరోసారి విజయవంతంగా నిర్వహించి రికార్డు సమయంలో ఫలితాలను విడుదల చేయడంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) అద్భుతంగా పని చేసిందని ప్రశంసించారు. వారి కృషిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈ ఫలితాలను https://natboard.edu.in/index వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. మార్చి 25నుంచి విద్యార్థులు తమ స్కోర్ కార్డుల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్బీఈఎంఎస్ ఓ ప్రకటనలో తెలిపింది.