Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రాజస్థాన్
యువకుడి కడుపులో నుంచి 56 బ్లేడు ముక్కలను బయటకు తీశారు రాజస్థాన్ వైద్యులు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ అరుదైన శస్త్రచికిత్స చేశారు. జాలోర్ జిల్లా సంచోర్ ప్రాంతానికి చెందిన యశ్పాల్ సింగ్.. మరో నలుగురు మిత్రులతో కలిసి బాలాజీ నగర్లో ఉంటున్నాడు. అతడు ఓ ప్రైవేటు సంస్థలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం యశ్పాల్ మిత్రులంతా విధులకు వెళ్లగా.. అతనొక్కడే గదిలో ఉన్నాడు. వారు వెళ్లిన ఓ గంటసేపటికి యశ్‌పాల్‌కు రక్తపు వాంతులయ్యాయి. దీంతో మిత్రులకు ఫోన్ చేసిన యశ్పాల్ తన ఆరోగ్యం బాగాలేదని వారికి చెప్పాడు. అక్కడికి వచ్చిన మిత్రులు.. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎక్స్‌రే సహా మిగతా వైద్య పరీక్షలు చేసిన మెడ్‌ప్లస్ ఆసుపత్రి వైద్యులు.. కడుపులో 56 బ్లేడ్ ముక్కలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీశారు. యువకుడి కడుపులోకి ఈ బ్లేడ్ ముక్కలు ఎలా వచ్చాయనేది మాత్రం వారు వెల్లడించలేదు.