Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా బుధవారంనుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించరు. ఏప్రిల్ నాలుగో తేదీ వరకు పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతాయి. ఉదయం 8.30 గంటలనుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షలకు సంబంధించిన సమస్యలపై ఇంటర్ విద్యామండలి టోల్‌ఫ్రీ నంబరు 18004257635 ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో 1,489 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 10,03,990మంది పరీక్షలు రాయనున్నారు. మొదటి ఏడాది విద్యార్థులు 4,84,197, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,19,793 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. అన్ని కేంద్రాల్లోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేశారు.