Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: తెలంగాణ సర్కారు కృషితో ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు పునర్జన్మ లభించింది. అవయవ మార్పిడుల్లో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. బ్రెయిన్ డెడ్ లేదా మరణించిన తర్వాత అవయవాలను సేకరించి.. మరికొంత మందికి జీవితాలను ఇవ్వడంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. 2022లో మరణించినవారి నుంచి సేకరించి అత్యధిక అవయవ మార్పిడులు చేసిన రాష్ట్రంగా తెలంగాణ సత్తాచాటింది. గతేడాది దేశవ్యాప్తంగా డిసీజ్డ్ ట్రాన్స్ప్లాంట్లు 2,765 జరిగాయి. ఇందులో తెలంగాణలోనే 655 జరుగడం విశేషం. 24 శాతం ట్రాన్స్ప్లాంట్లు అంటే దేశవ్యాప్తంగా ప్రతి నాలుగు సర్జరీల్లో ఒకటి తెలంగాణలోనే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, పటిష్టంగా అమలవుతున్న జీవన్‌దాన్ కార్యక్రమం ఫలితంగానే ఇది సాధ్యమైంది.