Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఆస్కార్ వేడుకల అనంతరం ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు తారక్‌కు ఘనస్వాగతం పలికారు. ఎన్టీఆర్ పేరుతో ఉన్న జెండాలు పట్టుకుని జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తారక్ మీడియాతో మాట్లాడాడు. ఆస్కార్ రావడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఆస్కార్ అవార్డు మరింత బాధ్యతను పెంచిందని కొనియాడాడు. ఆస్కార్ వేడుకల్లో పాలొనడం ఎంతో సంతోషంగా అనిపించిందని తారక్ అన్నాడు. కీరవాణి, చంద్రబోస్ అవార్డు పట్టుకొని స్టేజిపై నిల్చున్నప్పుడు ఆనందగా అనిపించింది. అది మాటల్లో వర్ణించలేనిది. మన దేశబరువు ఎంతుందో ఆస్కార్ బరువు అంతే ఉందని వెల్లడించాడు. భారతీయుడిని అందులో తెలుగువాడిని అయినందుకు చాలా గర్వపడుతున్నాను. మేము ఇంతటి గౌరవాన్ని దక్కించుకున్నామంటే దానికి కారణం అభిమానులు, సినీ ప్రేక్షకులు. వాళ్ల ప్రేమ, ఆశిస్సుల వల్లే ఈ అవార్డు సాధ్యమైంది. ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికి నా కృతజ్ఞతలు అంటూ తారక్ వెల్లడించాడు.
రాజమౌళి చేతిలో ఆస్కార్ అవార్డు చూసినప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయని, అవార్డు వచ్చిన వెంటనే మొదటిగా తన భార్య ప్రణతికి ఫోన్ చేసినట్లు తారక్ చెప్పుకొచ్చాడు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట ఆస్కార్ గెలిచింది. తొలిసారి ఆ విభాగంలో భారతీయ సినిమాకు ఆస్కార్ రావడంపై సినీ ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తారక్ ప్రస్తుతం కొరటాల శివతో సినిమాకు సిద్ధమౌవుతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనుంది.