Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. గుజరాత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా జైమిన్ షాతో జీత్ నిశ్చితార్థం ఈనెల 12న అహ్మదాబాద్‌లో జరిగినట్లు తెలుస్తోంది. కొద్ది మంది బంధువుల సమక్షంలోనే ఈ కార్యక్రమం జరిగినట్లు చెబుతున్నారు. పెళ్లి ఎప్పుడనే వివరాలు బయటకు రాలేదు. ప్రస్తుతం జీత్ అదానీ.. అదానీ గ్రూపులో వైస్ ప్రెసిడెంట్‌గా (గ్రూపు ఫైనాన్స్) బాధ్యతలు నిర్వహిస్తున్నారు.