Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బ్యాట్ తో విధ్వంసం సృష్టించడాన్ని మైదానంలో ఎన్నో సందర్భాల్లో చూశాం. కానీ, ఇప్పటి వరకు కోహ్లీ డ్యాన్స్ చేయడాన్ని ఎవరూ చూసి ఉండరు. ఈ స్టార్ క్రికెటర్ బ్యాట్ పట్టుకుని నార్వే గ్రూపుతో కలసి ఎంతో అందంగా స్టెప్పులు వేసి అదరగొట్టాడు. ఈ వీడియో క్లిప్ నిడివి చాలా స్వల్పంగానే ఉన్నా.. కోహ్లీ డ్యాన్స్ చూసిన వారు ఎవరైనా శభాష్ అనాల్సిందే. నార్వే డ్యాన్స్ గ్రూప్ ‘క్విక్ స్టైల్’ చేసే ‘పెప్పీ డ్యాన్స్’ కు మంచి ఆదరణ ఉంది. ఇదే బృందం విరాట్ కోహ్లీని కలవడంతో అందమైన దృశ్యం ఆవిష్కృతమైంది. క్విక్ స్టయిల్ తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో కోహ్లీతో కలసి చేసిన డ్యాన్స్ వీడియోని పోస్ట్ చేసింది. స్టీరియో నేషన్ పాడిన ఇషక్ అనే పాటకు వీరు డ్యాన్స్ చేశారు. ఇప్పటికే 29 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. 73 లక్షలకు పైగా వ్యూస్ కూడా వచ్చాయి. కోహ్లీ భార్య అనుష్క శర్మ ఫైర్ ఎమోజీలతో స్పందన వ్యక్తం చేసింది.