Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
గేయ రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త ) అభినందనలు తెలిపింది. ఈసందర్భంగా చంద్రబోస్‌ను ఆప్త అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్ కొట్టె సత్కరించారు. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబోస్ తాజాగా అట్లాంటా వెళ్లారు. ఈ సందర్భంగా ఆప్త సభ్యులు చంద్రబోస్‌కు సాదర గస్వాగతం పలికారు. ఆయనను సన్మానించారు. యావత్ తెలుగు ప్రజలే కాకుండా ప్రతి ఒక్క భారతీయుడి కలను నెరవేర్చారని ఈ సందర్భంగా ఉదయభాస్కర్ కొట్టే కొనియాడారు. తెలుగుదనం ఉట్టిపడేలా, తెలుగు నేటివిటీతో భవిష్యత్తులో చంద్రబోస్ కలం నుంచి మరెన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు రావాలని ఆకాంక్షించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు అట్లాంటాలో జరిగే 15వసంతాల ఆప్త కన్వెన్షన్‌కు హాజరుకావాలని చంద్రబోస్‌ను ఉదయ్‌భాస్కర్ సాదరంగా ఆహ్వానించారు. దీనికి చంద్రబోస్ కూడా అంగీకారం తెలిపారు.