Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- స్టేషన్ ఘన్ పూర్
లైంగిక ఆరోపణల విషయంలో ఇటీవల వార్తల్లోకెక్కిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత తాటికొండ రాజయ్య ఓ వేడుకలో భావోద్వేగానికి లోనయ్యారు. కరుణాపురంలో బుధవారం జరిగిన ఓ చర్చి ఫాదర్ పుట్టిన రోజు వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసేటపుడు ఎమ్మెల్యే భావోద్వేగానికి లోనయ్యారు. కేకు ముందు కూర్చుని గుక్కపట్టి ఏడ్చేశారు. (వీడియో లింక్) తనపై లైంగిక ఆరోపణలు రావడంతో తీవ్రంగా కలత చెందానని చెప్పారు.
రాజకీయంగా ఎదుర్కోలేక, వచ్చే ఎన్నికల్లో తనకు పోటీగా నిలుచుని గెలవలేమని ఇలాంటి నీచానికి దిగజారారని మండిపడ్డారు. కూతురు వయస్సున్న మహిళను అడ్డుపెట్టుకుని తనపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.