Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
హుస్సేన్ సాగర్ తీరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహ పనులు పూర్తి కావొచ్చాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విగ్రహ నిర్మాణ పనులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం పరిశీలించారు.
అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి కొప్పుల.. ఏప్రిల్ 5లోగా పూర్తి చేయాలని ఆదేశం హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహ పనులు పూర్తి కావొచ్చాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విగ్రహ నిర్మాణ పనులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలు, ఆలోచనలను భవిష్యత్ తరాలు నిత్యం స్మరించుకునేలా హుస్సేన్ సాగర్ తీరంలో ఈ భారీ విగ్రహ నిర్మాణం తలపెట్టినట్లు తెలిపారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంత్రి పురస్కరించుకుని ఈ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు.
ఏప్రిల్ 14న అట్టహాసంగా నిర్వహించే అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు దేశంలోని పలువురు ప్రముఖులు హాజరవుతారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కాబట్టి ఏప్రిల్ 5 లోపే నిర్మాణ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా వేగంగా పనులను గడువులోపు పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీ లకు సూచించారు. ప్రధాన విగ్రహం, ల్యాండ్‌స్కేప్ ఏరియా, రాక్ గార్డెన్, లాన్స్‌లో ప్లాంటేషన్, పార్లమెంట్ ఆకృతి వచ్చే స్థంభాల సాండ్స్టోన్ వర్క్స్, వాటర్ ఫౌంటైన్, పార్కింగ్ ఏరియా, మెయిన్ ఎంట్రన్స్ క్లౌడింగ్ వర్క్స్, గ్రానైట్ ఫ్లోరింగ్, అధునాత ఆడియో, వీడియో రూం తదితర అన్ని రకాల పనులకు చార్ట్ రూపొందించుకుని.. ఓ ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. అందుకు సరిపడా మ్యాన్‌పవర్‌ను పెంచాలని సూచించారు.