Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: మటన్ తిని ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని అరకు లోయలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతరామరాజు జిల్లా అరుకులోయ మండలం గన్నేల పంచాయతి తడక గ్రామానికి చెందిన ఓ కుటుంబం మంగళవారం రాత్రి మటన్ తెచ్చుకొని వండుకొని కుటుంబ సభ్యులందరూ తిన్నారు.
అనంతరరం కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి వాంతులు, విరేచనాలు అవడంతో స్థానికులు స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ఈఘటనలో ఐదేళ్ల చిన్నారి మీనాక్షి చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగతా 8 మంది కుటుంబ సభ్యుల పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నం తరలిస్తామని వైద్యులు తెలిపారు.