Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మోడీ, ఈడీ, బోడికి భయపడే ప్రసక్తే లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణకు పట్టిన శని మోడీ అని మండిపడ్డారు. ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారో వచ్చే ఎన్నికల్లో ప్రజలే తీర్పును ఇస్తారని అన్నారు. మోడీ మన దేశంలో అద్భుతమైన నటుడని... ఆయన్ని పంపితే ఆస్కార్ తప్పకుండా వస్తుందని చెప్పారు. ఎన్నో మాయ మాటలు చెప్పి 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ... దేశ సంపదను దోచుకుని వాళ్ల దోస్తు ఖాతాలో వేస్తున్నారని విమర్శించారు. రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తానని చెప్పారని, వారి ఆదాయం రెట్టింపు కాలేదని అన్నారు. నల్లధనాన్ని విదేశాల నుంచి తెప్పిస్తానని చెప్పారని... ఇప్పుడు దాని గురించి అడిగితే నల్లముఖం వేస్తున్నారని ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ పాదయాత్రలు చేస్తున్నారని... ఇప్పటికే కాంగ్రెస్ కు 10 ఛాన్స్ లు ఇచ్చారని అన్నారు. 50 ఏళ్లలో నీళ్లు, కరెంట్, విద్య ఇవ్వనోళ్లకి మళ్లీ ఛాన్స్ ఎందుకివ్వాలని ప్రశ్నించారు. మెన్నటి వరకు మనల్ని చావగొట్టింది కాంగ్రెసోళ్లేనని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు విని మోసపోవద్దని చెప్పారు.