Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిసరాల్లో హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. విద్యార్థుల ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనల నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. ఐదుగురికి మించి గుమిగూడొద్దని పోలీసులు ఆదేశించారు. టీఎస్పీఎస్సీ పరిసరాల్లో ధర్నాలు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. టీఎస్పీఎస్సీ వద్ద జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఉండే ఇతర కార్యాలయాల సిబ్బందికి, స్థానికులకు,వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా పోలీసులు ఆంక్షలు విధించారు.