Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పార్లమెంట్లో కేంద్రం విపక్షాల గొంతు నొక్కుతోందని, ఇవాళ ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలకు దేశ సంపద దోచి పెడుతున్నారని మండిపడ్డారు. అదానీ కుంభకోణంపై ఈడీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, ఢిల్లీలో కాంగ్రెస్ నేతల అరెస్టుతో అదానీ, ప్రధాని చీకటి ఒప్పందం బయటపడిందన్నారు. అదానీ, ప్రధాని వేర్వేరు కాదు.. మోడీ చెప్పిన డబుల్ ఇంజన్ సర్కారు ఇదేనని తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలపై కాంగ్రెస్ పోరాడిందని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ, నిజామాబాద్‌ను అభివృద్ధి చేసిందే కాంగ్రెస్సేనని తెలపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చదువుకున్న పాఠశాలలు నిర్మించింది కాంగ్రెస్సేనని గుర్తుచేశారు. తాము తెలంగాణ ఇచ్చినందుకే కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రి అయ్యారని తెలిపారు. 24 గంటల కరెంటు ఈ ప్రభుత్వం ఇస్తుందని నిరూపిస్తే.. దేనికైనా సిద్ధమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 'మీరేం చేశారో.. మేమేం చేశామో చర్చకు సిద్ధమా?.. బీఆర్ఎస్ చేసింది.. 30వేల వైన్ షాపులు.. 60వేల బెల్ట్ షాపులు పెట్టడం మాత్రమే. అంతకు మించి రాష్ట్రానికి బీఆర్ఎస్ చేసిందేం లేదు' అని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.