Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇండియా, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ఈ నెల 17న ప్రారంభం కాబోతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి వన్డే జరగబోతోంది. తొలి వన్డేకు రోహిత్ శర్మ దూరం కానున్నాడు. తన భార్య రితికా సోదరుడు కృనాల్ వివాహ వేడుకల్లో రోహిత్ బిజీగా ఉన్నారు. రేపు, ఎల్లుండి కృనాల్ వివాహ వేడుక జరగనుంది. అయితే కొందరు నెటిజెన్లు రోహిత్ ను విమర్శిస్తున్నారు. బావమరిది పెళ్లి కోసం మ్యాచ్ కు దూరమవుతావా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ కామెంట్లను మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. సొంత బావమరిది పెళ్లికి వెళ్లడం తప్పా? అని మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ తొలి మ్యాచ్ లో హిట్ మేన్ రోహిత్ కనిపించకపోవడం ఆయన అభిమానులకు పెద్ద నిరాశే అని చెప్పుకోవాలి.