Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: కేంద్రీయ విద్యాసంస్థల్లో టీచర్ల భర్తీలో మోదీ సర్కార్ నిర్లక్ష్యం చూపుతున్నది. కేంద్రీయ విద్యాలయాల్లో 12,099, నవోదయ స్కూళ్లలో 3,139, సెంట్రల్ వర్సిటీల్లో 6,028 ఖాళీలు ఉన్నట్టు సాక్షాత్తు కేంద్రమే పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. ఈ పోస్టులను నింపలేదని ఒప్పుకొన్నది. కానీ, ఉద్యోగాల భర్తీకి తాత్సారం చేస్తున్నది. ఒకవైపు రెగ్యులర్ టీచర్లు లేకపోవడంతో కేంద్రీయ విద్యాలయాలు కునారిల్లుతున్నాయి. హైదరాబాద్లోని పికెట్ కేవీలో విద్యార్థులకు వారంలో రెండు రోజులు సెలవులిస్తున్నారు. కాంట్రాక్టు టీచర్లను నియమించి నెట్టుకొస్తున్న స్కూళ్లు అనేకం ఉన్నాయి. పట్టుబట్టి కేవీల్లో పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులిప్పుడు కేవీల్లో అడ్మిషన్లు రద్దుచేసుకొని, ఇతర పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.