Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబాబాద్
రుణం చెల్లించలేదని ఓ రైతు ఇంటి తలుపులను బ్యాంకు సిబ్బంది దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మదనాపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకు సిబ్బంది రైతు ఇంటి తలుపులను తరలిస్తున్న, కుటుంబ సభ్యులతో వాగ్వాదం వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. గ్రామానికి చెందిన గుగులోతు మోహన్ తన 2.05 ఎకరాల పట్టాదారు పాసుపుస్తకం తనఖా పెట్టి గూడూరులోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో 2021లో రూ.4.50 లక్షల రుణం పొందారు. ఒక్కో వాయిదాకు రూ.62 వేల చొప్పున.. ఇప్పటివరకు నాలుగు వాయిదాలు చెల్లించాల్సి ఉండగా రైతు రూ.60 వేలు మాత్రమే చెల్లించారు. మిగతా మూడు వాయిదాలు బకాయిపడ్డారు. నోటీసులు జారీ చేసినా స్పందించలేదని చెబుతూ.. అధికారులు ఈ నెల 10న పోలీసులను వెంటబెట్టుకుని రైతు ఇంటికెళ్లారు.