Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మహబూబ్ నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నేడు జరగనుంది. ఈ క్రమంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్ల చేశారు.
ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. కౌంటింగ్ కోసం 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. వివిధ పోలింగ్ కేంద్రాల నుండి వచ్చిన బ్యాలెట్ బాక్స్ లోని బ్యాలెట్ పేపర్స్ ను మొదటగా బండిల్స్ తయారు చేసి అవన్నీ మిక్సింగ్ చేసిన తర్వాత ప్రతి టేబుల్ వైజ్ గా పంపిణీ చేసి కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఎన్నికల కౌంటింగ్ దాదాపు గా 1300 ల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్ల చేశారు.
ఇదే తరుణంలో ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 3 గ్రాడుయేట్, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్ విధానంలో జరిగిన ఎన్నిక కావడంతో లెక్కింపు విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.