Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలోని కౌంటింగ్ సెంటర్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. కేంద్రంలోని రెండు గదుల్లో ఓట్ల లెక్కింపునకు మొత్తం 28 టేబుళ్లను అధికారులు ఏర్పాటుచేశారు. ఒక్కో గదిలో ముగ్గురు ఏఆర్వోలను, రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద అదనంగా మరో ముగ్గురు ఏఆర్వోలను నియమించారు. కౌంటింగ్లో ఏ అభ్యర్థికీ తొలి ప్రాధాన్య ఓట్లలో 50 శాతానికిపైగా రాకపోతే సెకండ్ ప్రయార్టీ ఓట్లను లెక్కించి విజేతను ప్రకటించనున్నారు. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఈ నెల 13న పోలింగ్ జరిగింది. నియోజకవర్గంలోని 9 జిల్లాల్లో సుమారు 29,720 మంది ఓటర్లు ఓటు నమోదుచేసుకున్నారు. 90.40 పోలింగ్ శాతం నమోదయింది. మొత్తం 21 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ప్రదాన పోటీ చెన్నకేశవ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్దన్ రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, మాణిక్ రెడ్డి మధ్య ఉన్నది.