Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
శంషాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. 4 ఏళ్ల చిన్నారిపై అతి దారుణంగా లైంగిక దాడి జరిగింది. పాపను స్థానికులు హుటాహుటిన నీలోఫర్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వెంటనే నీలోఫర్‌లో వైద్యులు పాపకు సర్జరీ చేశారు. పాప పరిస్థితి విషమంగా మారింది. శంషాబాద్ ఫ్లై ఓవర్ లేబర్ క్యాంప్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి తల్లిదండ్రులు బెంగళూరు నుంచి ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు వెంకటయ్యను అరెస్ట్ చేశారు.