Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వెల్లింగ్టన్
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. గురువారం ఉదయం న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉన్న కెర్మాడెక్ దీవుల్లో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 7.1 గా నమోదయింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సముద్రంలో భూకంపం సంభవించినందున, భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల వ్యాసార్థంలో సునామీ సంభవించవచ్చని తెలిపింది. ఈ తరుణంలో సునామీ హెచ్చరికలు జారీచేసింది. అయితే ఈ భూకంపం వల్ల న్యూజిలాండ్‌కు ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది.