Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హనుమకొండ
హన్మకొండలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హనుమకొండలోని సువిద్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మురారిశెట్టి నాగజ్యోతి అనే విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నిన్ననే నాగజ్యోతి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసింది. అయితే రాత్రి 9గంటల సమయంలో విద్యార్థిని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే కాలేజీ యాజమాన్యం విద్యార్థిని మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
నాగజ్యోతి సొంతగ్రామం జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల. నాగజ్యోతి మృతిపట్ల బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఎంజీఎం మార్చురీ వద్దకు చేరుకున్న విద్యార్థిని బంధువులు అక్కడ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థిని మృతిపై అనుమానాలు ఉన్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన తర్వాతే ఎంజీఎం తరలించారని బంధువులు చెబుతున్నారు. నాగజ్యోతి సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదని అంటున్నారు. చనిపోయాక తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఎలా తరలిస్తారని బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.