Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో భేటీకానున్నారు. ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. సీఎం పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే రాష్ట్ర సమస్యలు,పెండింగ్ బకాయిలు తదితరాలు సీఎం జగన్ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. మరికొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముందని సమాచారం. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై వినతి పత్రాలను వారికీ జగన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. జూలైలో విశాఖ నుంచి పాలన చేస్తామని ఇప్పటికే కేబినెట్ భేటీలో మంత్రులకు స్పష్టత ఇచ్చారు. దీంతో అక్కడి నుంచి ప్రభుత్వ పాలనకు దాదాపుగా ముహూర్తం ఖరారు కూడా అయింది.దీంతో విశాఖ నుంచి పాలనపై కేంద్ర పెద్దలకు సీఎం జగన్ సమాచారం ఇవ్వబోతున్నట్లు చర్చ జరుగుతోంది.