Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 9,212 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు మార్చి 27నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని సీఆర్పీఎఫ్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం తెలిపింది. ఈ పోస్టులకు పురుషులు, మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేది కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో ఒకటి. ఇది భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తారు. వ్రాత పరీక్ష, PET & PST, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ , డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. సీఆర్పీఫ్ కానిస్టేబుల్ 9212 కానిస్టేబుల్ ఖాళీల కోసం టెక్నికల్ మరియు ట్రేడ్స్మన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. సీఆర్పీఫ్ రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అధికారిక వెబ్సైట్ www.crpf.nic.in లో చూడొచ్చు.