Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐపీఎల్ 2023 ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్, వైస్ కెప్టెన్‌గా టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను నియమించింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్రకటన చేసింది.
అయితే గత ఏడాది చివరన రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో టీమిండియా తరఫున పలు కీలక సిరీస్‌లకు పంత్ దూరమయ్యాడు. తాజాగా ఐపీఎల్ 2023 కూడా ఆడటం లేదు. ఈ తరుణంలో పంత్ స్థానంలో అనుభవజ్ఞుడిని కెప్టెన్‌గా నియమించుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావించింది.